MSRTC: ఆ యువతి చదివింది ఎంసీఏ.. బ్యాంక్ మేనేజర్ జాబ్‌కి గుడ్ బై చెప్పి ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా మారిన వైనం

|

Feb 01, 2023 | 12:46 PM

మహారాష్ట్ర ఆర్‌టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని యువతులను డ్రైవర్ల శిక్షణ కోసం ఎంపిక చేశారు.

MSRTC: ఆ యువతి చదివింది ఎంసీఏ.. బ్యాంక్ మేనేజర్ జాబ్‌కి గుడ్ బై చెప్పి ఆర్టీసీ బస్ డ్రైవర్‌గా మారిన వైనం
Shital Shinde Rtc Driver
Follow us on

ఎవరైనా ఏసీ గదుల్లో ఇబ్బందులు లేని ఉద్యోగం వెతుకుతుంటారు. కానీ ఈ అమ్మాయి ఉన్న మంచి ఉద్యోగం వదిలి సాధారణ డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించింది. 27 సంవత్సరాల శీతల్‌ శిండే.. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA) డిగ్రీ ఉత్తీర్ణత అనంతరం 2014 నుంచి మహారాష్ట్ర  పుణెలోని యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజరుగా నాలుగేళ్లు విధులు నిర్వహించింది. అయితే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బస్‌ డ్రైవరుగా మారిపోయింది. మంచి జీతం.. ఏసీ గదిలో విధులు.. అయినా శీతల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర శిక్షణ పూర్తి కావచ్చింది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆర్‌టీసీలో చేరానని ఆమె చెబుతున్నారు.

మహారాష్ట్ర ఆర్‌టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికే ఉన్నప్పటికీ, 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని యువతులను డ్రైవర్ల శిక్షణ కోసం ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న 100 మంది మహిళల మొదటి బ్యాచ్‌లో శీతల్ ఒకరు.  మధ్యలో కరోనాతో విరామం రాగా, చివరకు 17 మంది మహిళలు మిగిలారు.  వీరిలో ఒకరైన శీతల్‌ శిండే మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్‌టీసీ తొలి బ్యాచ్‌ మహిళా డ్రైవరుగా విధుల్లో చేరనున్నారు.

తనకు చిన్నతనలో రాష్ట్ర రవాణా బస్సులలో ప్రయాణించాను .. ఇష్టపడుతున్నాను.. అందుకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేసి.. డ్రైవర్ గా మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. రాష్ట్రమంతటా ప్రయాణించి ప్రజలతో మమేకమవ్వాలనే తన కోరికను నెరవేర్చుకుంటానని చెబుతున్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..