పోలీసుల అదుపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే..

| Edited By:

Jul 04, 2019 | 11:34 PM

మున్సిపల్ ఇంజనీర్‌పై బురద కుమ్మరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ ఎస్పీ దీక్షిత్ గెడం ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై నితీశ్ రాణే తండ్రి నారాయణ్ రాణే కూడా స్పందించారు. నితేశ్ చేసింది తప్పే అని.. అందుకు ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. కాగా, ముంబై-గోవా హైవేపై ఉన్న కంకవాలి బ్రిడ్జిని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. బ్రిడ్జిపై ఏర్పడిన […]

పోలీసుల అదుపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే..
Follow us on

మున్సిపల్ ఇంజనీర్‌పై బురద కుమ్మరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ ఎస్పీ దీక్షిత్ గెడం ఈ విషయాన్ని వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై నితీశ్ రాణే తండ్రి నారాయణ్ రాణే కూడా స్పందించారు. నితేశ్ చేసింది తప్పే అని.. అందుకు ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతున్నామన్నారు.

కాగా, ముంబై-గోవా హైవేపై ఉన్న కంకవాలి బ్రిడ్జిని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను చూసి అక్కడే ఉన్న ఇంజనీర్ ప్రకాశ్ శేడేకర్‌పై నిప్పులు చెరిగారు. రోడ్లన్నీ గుంతలు, బురదతో ఉంటే ప్రజలు ఎలా ప్రయాణిస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ప్రశ్నలకు ఇంజనీర్ వివరణ ఇస్తున్నా… అతని మాటు వినకుండా.. దాడికి యత్నించారు. పక్కనే ఉన్న బురదను బకెట్‌తో తీసుకుని ఆయనపై కుమ్మరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బురదతో దాడిచేయడంపై ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ అధికారిపై బురద కుమ్మరించిన ఘటనలో కంకావలి పోలీసులు రాణేతోపాటు ఆయన అనుచరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చాక.. రాణే వారితో వాగ్వాదానికి దిగాడు.