EV Battery Explodes: అర్థరాత్రి ఘోర ప్రమాదం.. ఇంట్లో ఛార్జింగ్ పెట్టగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చిన్నారి మృతి..

|

Oct 03, 2022 | 4:10 PM

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టగా, అది పేలిపోయింది. ఈ ఘటనలో 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

EV Battery Explodes: అర్థరాత్రి ఘోర ప్రమాదం.. ఇంట్లో ఛార్జింగ్ పెట్టగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చిన్నారి మృతి..
Ev Battery Explosion
Follow us on

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దారుణం జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టగా, అది పేలిపోయింది. ఈ ఘటనలో 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాల్ఘర్‌లోని వసాయ్‌లో ఛార్జ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో స్కూటర్ పక్కనే ఉన్న బాలుడు.. తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మాణిక్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్ 22న రాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ పెట్టి నిద్రించారు. 7 ఏళ్ల బాలుడు షబ్బీర్ అన్సారీ, అతని నాన్నమ్మ ఇంటి హాలులో నిద్రిస్తున్నారు. ఆ పక్కనే అతని తండ్రి ఈవీ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాడు. అయితే, అర్థరాత్రి దాటిన తరువాత అంటే సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 4:30 గంటలకు ఈవీ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో బాలుడు అన్సారీ 70 శాతానికి పైగా కాలిపోయాడు. అన్సారీ నానమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే, తీవ్రంగా గాయపడిన అన్సారీ.. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఫాల్టీ బ్యాటరీ కారణంగా ఈవీ స్కూటర్ పేలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గత కొద్ది కాలంగా దేశంలో అక్కడక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పేలుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈవీ పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బ్యాటరీని బయటకు తీసి, బెడ్ రూమ్‌లో ఛార్జింగ్ పెట్టగా, ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..