Rare Surgery: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. మనకు ఈ ప్రపంచాన్ని చూపించే నయనాలు చాలా సెన్సిటివ్. కంట్లో చిన్న నలుసు పడితేనే అల్లాడిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి కంట్లోకి 6 అంగుళాల పొడవైన కత్తి దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. టెస్టులు చేసిన అనంతరం.. కాస్త రిస్క్ అయినా సరే సర్జరీ చేయాలని డిసైడయ్యారు వైద్యులు. ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. మహారాష్ట్ర(Maharashtra) నందుర్బార్ జిల్లా(Nandurbar district) తలోడా తాలుకాలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల విలన్ సోమా భిలావే అనే వ్యక్తి పనుల్లో ఉండగా.. అనుకోకుండా కత్తి కంట్లోకి దూసుకెళ్లింది. వెంటనే అతడిని ధులేలోని బావూసాహెబ్ హీరే గర్నమెంట్ కాలేజ్‌కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. టెస్టులు చేసిన అనంతరం పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లకు ఓ అంచనాకు వచ్చారు. వెంటనే అందుబాటులో ఉన్న వైద్యులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆపై ఆపరేషన్ చేయాలని డిసైడయ్యారు. నైట్ రెండున్నర సమయంలో బాధితుడు హాస్పిటల్‌కు రాగా.. ఆలస్యం చేయకుండా గంట వ్యవధిలోనే ఆపరేషన్ షురూ చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్ ముకర్రమ్ ఖాన్ అండ్ టీమ్.
‘సర్జరీకి ముందు ఆతని కంట్లో గుచ్చుకుంది ఏదో లోహపు వస్తువు అనుకున్నాం. కానీ రిమూవ్ చేశాక అది కత్తి అని నిర్ధారించుకున్నాం. బాధితుడు విపరీతమైన పెయిన్ అనుభవించాడు. ఎట్టకేలకు అతనికి విముక్తి కలిగించగలిగాం’ అని వైద్యులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..