మహారాష్ట్రలో కరోనా రికార్డు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఇప్పటికీ కరాళనృత్యం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 16,867 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 328 మంది ఈరోజు ప్రాణాలు..

మహారాష్ట్రలో కరోనా రికార్డు

Updated on: Aug 29, 2020 | 9:03 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఇప్పటికీ కరాళనృత్యం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 16,867 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 328 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 24,103 కు చేరింది. ఇక ఇవాల్టితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,64,281 కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 1,85,131 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 5,54,711 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రనే కావడం విశేషం.