khammam: రైతులను మోసం చేసిన ఓ వ్యాపారి.. మార్కెట్‌ ధర కంటే ఎక్కువఇస్తానని పంట తీసుకుని పరారీ..

|

Feb 07, 2023 | 7:04 AM

ఓ వ్యాపారి.. రైతుల నుంచి పంట తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరారీ అయ్యాడు. దీంతో ఆ రైతులు తమకి న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ గడప ఎక్కారు.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

khammam: రైతులను మోసం చేసిన ఓ వ్యాపారి.. మార్కెట్‌ ధర కంటే ఎక్కువఇస్తానని పంట తీసుకుని పరారీ..
Khammam Farmers
Follow us on

అందరికీ అన్నం పెట్టె అన్నదాతను ప్రకృతి అతి వృష్టి, అనావృష్టి మాత్రమే కాదు.. నకిలీ పురుగు మందులు, విత్తనాలు వంటి ఇచ్చి అనేక మంది వ్యాపారాలు కూడా మోసం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ వ్యాపారి.. రైతుల నుంచి పంట తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరారీ అయ్యాడు. దీంతో ఆ రైతులు తమకి న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ గడప ఎక్కారు.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలో రైతులను ఓ వ్యాపారి మోసం చేశాడు. దీంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన రైతుల నుంచి మహారాష్ట్ర లోని నాందేడ్ కు చెందిన మాధవ్ పటేల్ అనే వ్యాపారి ధాన్యం, మిర్చి, పత్తి కొనుగోలు చేశాడు. ముందుగా కొంతమంది రైతులకు డబ్బులు టైమ్‌కు చెల్లించాడు. దీంతో మిగతా రైతులు కూడా అతనికే తమ పంట అమ్మారు. సుమారు 50 లక్షల వరకు సరుకు కొనుగోలు చేసిన వ్యాపారి ఇప్పటివరకూ డబ్బులు ఇవ్వకపోవడం తో వ్యాపారి మాధవ్ పటేల్ ను రైతులు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి పటేల్ పరారయ్యాడు.

చివరకు ఎట్టకేలకు మాధవ్ పటేల్ ఆచూకీ తెలుసుకున్న రైతులు అతడిని తీసుకొచ్చి కూసుమంచి పోలీసులకు అప్పగించారు. వ్యాపారంలో నష్టం రావడంతో రైతులకు తిరిగి డబ్బులు చెల్లించలేదని వ్యాపారి వాపోయాడు. అయితే మార్కెట్‌ రేట్‌ కంటే ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పడంతో అతనికి పంట మొత్తం అమ్మామని రైతులు అంటున్నారు. ఇప్పుడు వ్యాపారి ప్లేట్‌ ఫిరాయించి తమను మోసం చేశాడని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..