జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. అందుకు లోక్‌సభ, రాజ్యసభ కూడా ఆమోదం తెలిపాయి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ, పాకిస్తాన్‌లోని కొందరు వ్యక్తులు మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. భారత్‌కు మద్దతుగా తమ అభిప్రాయాలను బ్యానర్లపై ముద్రించారు. ‘మహా భారత్‌కు ముందడుగు’ అంటూ.. శివసేన ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ముద్రించి వాటిని ఇస్లామాబాద్ వీధుల్లో ఏర్పాటు చేశారు. ఆక్రమిత కశ్మీర్ తర్వాత భారత్ బలూచిస్తాన్, ఆజాద్ కశ్మీర్‌ను పాక్ నుంచి తీసేసుకుంటుందని అందులో రాశారు. భారత్‌లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో పాక్ జాతీయులు మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Hello, sir @dcislamabad @hamzashafqaat @ICT_Police what’s going on here, who has posted these banners in the heart of Islamabad under your watch & what was the purpose & do you even know about this?
#کشمیرکاسودا_نامنظور#KashmirIntegrated #Artical370 pic.twitter.com/ldlYNjNkw4— Siyar Ali Shah (@iSiyarAliShah) August 6, 2019