రుణాల పేరుతో రైతులపై మోయలేని బరువును మోపారు.. రాహుల్, కమలనాథ్‏లపై సీఎం చౌహన్ ఆగ్రహం..

|

Dec 15, 2020 | 7:41 PM

తమను రైతు వ్యతిరేకులని విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కమలనాథ్‏లపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణాల పేరుతో రైతులపై మోయలేని బరువును మోపారు.. రాహుల్, కమలనాథ్‏లపై సీఎం చౌహన్ ఆగ్రహం..
Follow us on

తమను రైతు వ్యతిరేకులని విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కమలనాథ్‏లపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోయలేని బరువులను పెట్టారన్నారు. ఇప్పుడు ఆ బరువును బీజేపీ ప్రభుత్వం దింపుతుందని.. రైతులను మోసం చేసినవారే రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దెవ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం డిసెంబర్ 18న రూ.1,600 కోట్లను నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం చాలా వరకు నగదును వారి ఖాతాల్లో జమచేశామని ఇప్పుడు అదే చేస్తామని తెలిపారు. తర్వలో ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,600కోట్లను జమ చెయనున్నట్లు శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు.