Tamil Nadu: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బిఐ సిబ్బందిపై తమిళ సంఘాలు మండిపాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

Tamil Nadu: తమిళులు(Tamils) తమ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అత్యంత శ్రద్దాశక్తుల..తో పాటిస్తారు. వాటిని గౌరవిస్తారు. రాష్ట్రాన్ని గానీ.. వారి సాంప్రదాయల గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగినా

Tamil Nadu: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బిఐ సిబ్బందిపై తమిళ సంఘాలు మండిపాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్
Tamil Anthem

Updated on: Jan 27, 2022 | 12:02 PM

Tamil Nadu: తమిళులు(Tamils) తమ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అత్యంత శ్రద్దాశక్తులతో పాటిస్తారు. వాటిని గౌరవిస్తారు. రాష్ట్రాన్ని గానీ.. వారి సాంప్రదాయల గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగినా ఊరుకోరు. అంతా ఒక్కటై పోరాడతారు. ఈ విషయం మళ్ళీ 73 రిపబ్లిక్ డే వేడుకల(Republic Day Celebrations) సందర్భంగా రుజువైంది. తమిళనాడు ఆనవాయితీ ప్రకారం నిర్వాహకులు వేడుకలలో తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాన్ని ఆలపించారు. తమిళులు అత్యంత గౌరవంగా భావించే ‘తమిళ్‌తాయ్‌ వాళ్తు’ (తమిళ తల్లిని కీర్తిస్తూ ప్రార్దన) చేశారు. అయితే ఈ సందర్భంగా ఆర్బేఐ ఉద్యోగ్యులు తమ రాష్ట్రీయ గీతాన్ని అవమానించారంటూ తమిళ సంఘాల ఆందోళనలు చేస్తున్నాయి. అంతేకాదు ఆర్బీఐ ఆఫీసుకు ముట్టడికి తమిళ సంఘాల పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీ ఐ చుట్టు భారీగా పోలీసుల మోహరించారు.

రిపబ్లిక్ డే వేడుకలలో తమిళ రాష్ట్రగీతం ఆలపిస్తున్న సమయంలో ఆర్బీఐ సిబ్బంది కూర్చుని విన్నారు. అలా రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో కుర్చుని ఉండడం తప్పంటూ ఆర్బీఐ సిబ్బంది వైఖరిని తమిళసంఘాలు , డీఎంకే ఎంపీ కనిమొళి తప్పుబబట్టారు. అంతేకాదు అసలు రాష్ట్ర ప్రభుత్వ నియమాలను ఆర్బీఐ సిబ్బంది ఎందుకు పాటించరని డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నిస్తున్నారు. ఆర్బిఐ బాంక్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళ గీతానికి ఎందుకు మర్యాద ఇవ్వరని కనిమొళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై మద్రాస్ హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:   గోదావరి జిల్లా స్పెషల్.. పీతల పులుసు.. టేస్టీగా ఎలా తయారు చేయాలంటే..