ఇదీ డిజిటల్ ఇండియా స్థితి ! ఫోన్ సిగ్నల్ కోసం 50 అడుగుల ఎత్తున స్తంభమెక్కి కూర్చున్న మధ్యప్రదేశ్ మంత్రి

| Edited By: Anil kumar poka

Feb 22, 2021 | 11:46 AM

ఫోన్ సిగ్నల్ అందక అవతకివారు చెప్పేది మనకు సరిగా వినబడక, మనం చెప్పేది అవతలివారికి సరిగా వినబడక నానా పాట్లు పడుతుంటాం..ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రి ఒకరికి...

ఇదీ డిజిటల్ ఇండియా స్థితి ! ఫోన్ సిగ్నల్ కోసం 50 అడుగుల ఎత్తున స్తంభమెక్కి కూర్చున్న మధ్యప్రదేశ్ మంత్రి
Follow us on

ఫోన్ సిగ్నల్ అందక అవతకివారు చెప్పేది మనకు సరిగా వినబడక, మనం చెప్పేది అవతలివారికి సరిగా వినబడక నానా పాట్లు పడుతుంటాం..ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రి ఒకరికి అలాంటి అనుభవమే కలిగింది.  అశోక్ నగర్ జిల్లాల్లోని ఆంఖో గ్రామాన్ని ఇటీవల విజిట్ చేసిన బ్రజేంద్ర సింగ్ యాదవ్ అనే మంత్రి ఈ  ‘గోల’ భరించలేక ఏకంగా 50 అడుగుల ఎత్తున స్తంభంపై అన్ని ఏర్పాట్లు చేసుకుని ఫోన్ లో సంభాషించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండ ప్రాంతాలతో కూడిన ఈ గ్రామంలో తమకు సరైన ఫోన్ నెట్ వర్క్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.  దీంతో ఆయన స్వయంగా 50 అడుగుల ఎత్తున ఇలా కూర్చుని ఫోన్ మాట్లాడి… అధికారుల దృష్టికి ఈ సమస్యను తెచ్చారు.  ఈ గ్రామంలో తాను 9 రోజులపాటు ఉన్నానని, ఇక్కడ  జరుగుతున్న భగవద్గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన చెప్పారు.

ఏమైనా మొబైల్ ఫోన్ నెట్ వర్క్ సరిగా లేని గ్రామంలో ఈ దేశంలో ఇంకా చాలా ఉన్నాయి.  మరి వాటి సంగతో అంటున్నారు నెటిజన్లు.. ఇదీ మన డిజిటల్ ఇండియా పరిస్థితి అని జోకులు వేస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video

దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video