కోవిడ్ రోగులకు ప్లాస్మా ఇస్తా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

| Edited By: Anil kumar poka

Aug 10, 2020 | 1:12 PM

కోవిడ్ రోగుల చికిత్స కోసం  తన ప్లాస్మా ఇస్తానని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కరోనా వైరస్ కి గురైన ఈయన గత జులై 25 న ఆసుపత్రిలో చేరగా.. 11 రోజులుగా చికిత్స పొంది ఈ నెల 5 న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్ రోగులకు ప్లాస్మా ఇస్తా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Follow us on

కోవిడ్ రోగుల చికిత్స కోసం  తన ప్లాస్మా ఇస్తానని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కరోనా వైరస్ కి గురైన ఈయన గత జులై 25 న ఆసుపత్రిలో చేరగా.. 11 రోజులుగా చికిత్స పొంది ఈ నెల 5 న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ట్రీట్ మెంట్ అనంతరం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.. కరోనా వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీలు నా శరీరంలో డెవలప్ అయి ఉంటాయి..అందువల్ల త్వరలో ప్లాస్మా ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నాను అని చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం చౌహాన్..హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని వీడియో ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.