
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక వింత, దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు మహిళల లోదుస్తులను దొంగిలిస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని లేబర్ కార్డు ద్వారా గుర్తించి పట్టుకున్నారు. విచారణలో, నిందితుడు వివిధ ప్రాంతాలలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు.
భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి చెందిన పోలీసులు ఈ షాకింగ్ దొంగతనం కేసును ఛేదించారు. ఒక యువకుడు మహిళల లోదుస్తులను దొంగిలించి, ఆపై వాటిని ధరించి తిరుగుతున్నాడు. నిందితుడి ఇంటి నుండి పోలీసులు అనేక లోదుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం (డిసెంబర్ 30) రాత్రి అమర్‌నాథ్ కాలనీలో నివసిస్తున్న ఒక డెయిరీ యజమాని తన ఇంటి బాల్కనీలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాడు. అర్ధరాత్రి 12:00 గంటల ప్రాంతంలో, అతను బాల్కనీలో కదలిక, నీడను చూశాడు. ఇంటి యజమాని అతన్ని గమనించినప్పుడు, నిందితుడు తన లోదుస్తులతో అక్కడి నుండి పారిపోయాడు. పారిపోతుండగా, నిందితుడు తన లేబర్ కార్డును పారేసుకున్నాడు. ఈ కీలకమైన క్లూ ఆధారంగా, కోలార్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 31)మధ్యాహ్నం నిందితుడిని అతని ఇంట్లో అరెస్టు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి, మహిళల లోదుస్తులు ధరించి నిద్రపోతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటపడింది.
నిందితుడు మందాకిని కాలనీలోని మరో ఇంట్లో గతంలో ఇలాంటి దొంగతనం చేశాడని బాధితుడు పోలీసులకు చెప్పాడు. అక్కడి నుంచి దొంగిలించిన లోదుస్తులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఇలాంటివే మరిన్ని నేరాలకు పాల్పడి ఉండవచ్చనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..