మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్నారు.. బ్రిటన్ తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ జర్మనీలో పర్యటిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త సంస్థల ఏర్పాటు గురించి ఈ పర్యటన కొనసాగుతోంది.. సీఎం చేపట్టిన మిషన్ ఇన్వెస్ట్‌మెంట్ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. జర్మనీ పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్.. టీవీ9 నెట్ వర్క్ సీనియర్ అడ్వైజర్ కౌశిక్ మౌలిక్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లో పెట్టుబడులు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, విజయాలు – విజన్ గురించి వివరణాత్మకంగా పంచుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రవాసులతో భేటీ అవ్వడం గర్వంగా ఉందంటూ మోహన్ యాదవ్ పేర్కొన్నారు. పెట్టుబడులతోపాటు విద్యావంతులైన, నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగాలను ఇవ్వడం, ఉపాధి, ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడే అవకాశాలను కల్పించడంపై రాష్ట్ర దృష్టిని ఆయన నొక్కి చెప్పారు.
సాంకేతికత – పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధి, పర్యాటకం తదితర అంశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.. గ్రీన్ ఎనర్జీ, సస్టైనబిలిటీ.. ప్రధాని మోదీ నిర్ణయాల గురించి మాట్లాడారు.. ఆయన మార్గనిర్దేశంలోనే పనిచేస్తామంటూ పేర్కొన్నారు.
ఫుట్‌బాల్, క్రీడల అభివృద్ధి: మధ్యప్రదేశ్‌లోని “మినీ బ్రెజిల్”, ఫుట్‌బాల్‌ను ఇష్టపడే బిర్చాపూర్ గ్రామం గురించి ముఖ్యమంత్రి ఇష్టపూర్వకంగా చర్చించారు. జర్మన్ కోచ్‌లను ఆహ్వానించడం, శిక్షణ కోసం ప్రతిభావంతులైన ఆటగాళ్లను పంపడం ద్వారా ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించే ప్రణాళికలను పంచుకున్నారు.. ఫుట్‌బాల్‌ను క్రీడల ద్వారా బంధాలను బలోపేతం చేయడానికి… యువతకు స్ఫూర్తినిచ్చే మార్గంగా పరిగణిస్తామన్నారు.
UK పెట్టుబడిదారుల నుంచి రూ.60,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని చెప్పారు.. నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యాలు, సాంకేతికత బదిలీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో భోపాల్‌లో ప్రపంచ పెట్టుబడి శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు, అభివృద్ధి అవకాశాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ప్రాంతీయ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విదేశీ సహకారానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు నిబద్ధతతో ఉన్నామని స్పష్టంచేశారు.
జర్మనీలో పెట్టుబడిదారులతో సమావేశమైన సీఎం డాక్టర్ యాదవ్ అక్కడి పెద్ద కంపెనీ ఏసీడీఎస్‌కు భోపాల్‌లో భూమిని కేటాయించారు. ఈ నిర్ణయం ప్రపంచ పారిశ్రామిక మ్యాప్‌లో మధ్యప్రదేశ్‌ను కొత్త కేంద్రంగా స్థాపించడానికి రుజువు చేస్తుందంటూ పేర్కొన్నారు. భోపాల్‌కు ప్రపంచ పారిశ్రామిక కేంద్రం హోదా లభిస్తుందని.. మధ్యప్రదేశ్‌లో జర్మనీ పెట్టుబడులకు ఇది కీలక ముందడుగు అని భావిస్తున్నారు. భోపాల్‌లోని ఆచార్‌పురాలో జర్మన్ కంపెనీ ACEDS లిమిటెడ్‌కు 27,200 చదరపు మీటర్ల (6.72 ఎకరాలు) భూమిని కేటాయించారు. ఈ ఒప్పందం ప్రకారం, భోపాల్‌లో తన పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 100 కోట్లకు పైగా ఆఫర్ చేసింది. ఈ సంస్థ స్థాపనతో వందలాది మందికి ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమ స్థాపనతో, ఎక్స్-రే యంత్రాల తయారీ, ఇతర పరికరాలు, సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లు, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో పని జరుగుతుంది.
మధ్యప్రదేశ్‌లో పెట్టుబడిదారులకు మంచి వాతావరణం ఏర్పడిందని, అక్కడ వ్యాపారాన్ని ప్రోత్సహించడంతో పాటు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం దూరదృష్టి ఆలోచన, పెట్టుబడిదారుల పట్ల సానుకూల దృక్పథం జర్మన్ కంపెనీని రాష్ట్రంలో తన ఉనికిని విస్తరించడానికి ప్రేరేపించాయన్నారు.
జర్మనీకి చెందిన ఏసీఈడీఎస్ కంపెనీకి భోపాల్‌లో భూమి కేటాయింపు ప్రారంభం మాత్రమేనన్నారు. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అవకాశాన్ని తీసుకురావడమే కాకుండా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూడా దారి తీస్తుందన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక పర్యటన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులకు తదుపరి ప్రధాన కేంద్రంగా మారడానికి మధ్యప్రదేశ్ పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని రుజువు చేసిందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..