తరచూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని షాకింగ్ ఘటనలు ఉంటే, మరికొన్ని భయానకంగా ఉంటాయి. ఇంకొన్ని మనుషుల్లోని కృరత్వానికి నిదర్శనంగా కనిపించేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వృద్ధుడిపై ఒక వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యం నెటిజన్లను షాక్ గురిచేస్తోంది. వీడియో ఆధారంగా ఘటన జరిగింది మధ్యప్రదేశ్‌లో అని, వృద్ధుడిపై దాడి చేసిన వ్యక్తి ఓ మాజీ కార్పొరేటర్ భర్తగా గుర్తించారు పోలీసులు. దీంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మనాసాలో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధుడిని ‘నువ్వు మహమ్మద్‌వా’ అని ప్రశ్నించి ఆధార్‌కార్డు చూపించమని ఓ వ్యక్తి గద్దించిన తర్వాత అతడు విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ఆ వృద్ధుడిని గుర్తుపట్టేందుకు పోలీసులు అతడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలను అతడి కుటుంబ సభ్యులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతడి పేరు భన్వర్‌లాల్ జైన్ అని, అతడి మానసిక స్థితి సరిగా లేదని వారు చెప్పినట్టు పేర్కొన్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని సర్సీకి చెందిన మానసిక అనారోగ్యంతో ఉన్న 65 ఏళ్ల భన్వర్‌లాల్ జైన్ అనే వృద్ధుడు తప్పిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడి కోసం గాలింపు చేపట్టగా అతడి మృతదేహం నీమూచ్ జిల్లాలోని రోడ్డు పక్కన లభించింది.. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత మృతుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ వ్యక్తి ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. వీడియో ఆధారంగా దాడి చేసిన వ్యక్తి బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త అని గుర్తించారు. ఆధార్ కార్డు తీయమని చెబుతూ అతడు వరుసగా ఆ వృద్ధుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి.
#Watch | MP: Bhanwarlal Jain mistaken for ‘Mohammed’, beaten to death by ex-BJP corporator’s husband@BJP4India #BJP #Neemuch #MP #BhanwarlalJain #BJPIndia #Politics #Politician #Trending #Corporator #Mohammed pic.twitter.com/CxOENkhV82
— Free Press Journal (@fpjindia) May 21, 2022
ఈ వీడియో వైరల్ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆధారంగా భన్వర్‌లాల్ జైన్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదైంది. మాజీ కార్పొరేటర్ భర్తను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.