Bus Accident: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 13 మంది సజీవ దహనం.. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

|

Dec 28, 2023 | 8:45 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్‌ ట్రక్‌ ఎదురుగా వస్తున్న ప్రయాణీకులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందిన సమాచారం మేరకు.. గుణ-ఆరోన్ రహదారిపై డంపర్‌ను బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో..

Bus Accident: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 13 మంది సజీవ దహనం.. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
Bus Accident
Follow us on

గుణా, డిసెంబర్‌ 28: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్‌ ట్రక్‌ ఎదురుగా వస్తున్న ప్రయాణీకులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 13మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందిన సమాచారం మేరకు.. గుణ-ఆరోన్ రహదారిపై డంపర్‌ను బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును డంపర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. 13 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 9 మృతదేహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ ట్వీట్‌ చేశారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని తెలిపారు. ప్రమాదానికి కారణానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మృతుల ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ.50వేలు చొప్పున అందజేయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగుచర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను సీఎం యాదవ్ ఆదేశించారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఈ సంఘటన బాధాకరమైనదిగా పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.