అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే అంతా బూడిదయ్యారు. వారంతా సొంత ఇల్లు లేని నిరుపేదలు.. చెత్త కుప్ప పక్కనే గుడిసెలు వేసుకొని.. చెత్త ఏరుకునే జీవితాలు వారివి.. ఇవాళ వారి జీవితాలు తెల్లవారకుండానే ముగిసిపోయాయి. చెత్తలో చెలరేగిన మంటలు గుడిసెకు అంటుకోని.. గాఢనిద్రలో ఉన్న వారంతా సజీవదహనం అయ్యారు. చనిపోయిన ఏడుగురిలో ఐదుగురు పిల్లలే కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది. పంజాబ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. లూథియానా సిటీలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు. వారు వలస కూలీలని, ఇక్కడి టిబ్బా రోడ్డులోని మున్సిపల్ చెత్త డంప్ యార్డు సమీపంలోని తమ గుడిసెలో నిద్రిస్తున్నారని అధికారులు తెలిపారు.
వలస కూలీ మంటల్లో చనిపోయాడు
లూథియానా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) సురీందర్ సింగ్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అందించారు. లుథియానా మునిసిపల్ చెత్త డంప్ యార్డ్ సమీపంలోని తమ గుడిసెలో వారు నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. మృతుల్లో దంపతులతోపాటు వారి ఐదుగురు పిల్లలుగా గుర్తించారు. వారి పేర్లు ఇంకా నిర్ధారించలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
మృతుల బంధువులను గుర్తించలేకపోయారు
ఈ ప్రమాదంలో దంపతులు, వారి ఐదుగురు పిల్లలు మరణించారని టిబ్బా స్టేషన్ ఇన్‌ఛార్జ్ రణబీర్ సింగ్ తెలిపారు. వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.. మంటల్లో కాలిపోయిన వ్యక్తులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.. ఆచూకీ తెలియక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుడిసెలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్