గ్యాస్ కొరత వేళ కేంద్రం కొత్త నిర్ణయం.. బ్లాక్‌మార్కెట్ చేస్తే కఠినచర్యలు- మోదీ

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా LPG సరఫరాను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశం నిర్వహించారు. భారతదేశంలో సరైన LPG సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

గ్యాస్ కొరత వేళ కేంద్రం కొత్త నిర్ణయం.. బ్లాక్‌మార్కెట్ చేస్తే కఠినచర్యలు- మోదీ
Government Gas Regulation

Updated on: Mar 10, 2026 | 5:23 PM

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా LPG సరఫరాను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశం నిర్వహించారు. భారతదేశంలో సరైన LPG సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ల కొరత పెను సమస్యగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఇంధన మార్కెట్‌ను రక్షించడానికి ప్రభుత్వం నేడు నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గ్యాస్ కొరతతో వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ప్రభావితమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ సప్లై మేనేజ్‌మెంట్ ఆథారిటీ (ESMA) యాక్ట్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ యూనిట్లు LPG ఉత్పత్తిని పెంచాలని, LPG నిల్వకు హైడ్రోకార్బన్‌లను జోడించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ESMA యాక్ట్ ప్రకారం, దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా సమస్యలను సమీక్షించి, అత్యవసరంగా అవసరమయిన ప్రాంతాలకు ప్రాధాన్యతా క్రమంలో సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి సేవా కేంద్రాలు గ్యాస్ సరఫరా కోల్పోకుండా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

కేంద్రం ప్రకటనతో ఈ యాక్ట్ అమలు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు, LPG డిస్ట్రిబ్యూటర్లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది.. సిలిండర్ల సరఫరా సమస్యను తగ్గించడమే కాకుండా, ప్రజల ఆరోగ్య, సేవా కేంద్రాల కొనసాగింపు కూడా నిర్ధారించబడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం. వంటగ్యాస్‌ ఉత్పత్తిని 10 శాతం పెంచాలని నిర్ణయించారు. రిఫైనరీలకు కేంద్రం ఇప్పటికే ఈవిషయంపై ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌ కొరతపై కేంద్రమంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు మోదీ. గ్యాస్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us