గుడ్‌న్యూస్‌.. LPG గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు! నేటి నుంచే అమలు..

వ్యాపారాత్మక LPG గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 51 తగ్గాయి. సెప్టెంబర్ 1 నుండి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1580కి తగ్గింది. ఇంటి వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు. జనవరి నుండి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ల ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

గుడ్‌న్యూస్‌.. LPG గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు! నేటి నుంచే అమలు..
Lpg

Updated on: Sep 01, 2025 | 12:49 AM

LPG గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. రూ.51 ధర తగ్గింది. అయితే ఈ తగ్గింపు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో మాత్రమే చేశారు. ఈ మార్పు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.1580లకు లభించనుంది. ఇప్పటివరకు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1631.50గా ఉంది. కొత్త ధరలు ఈ రోజు అంటే సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.

LPG గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పు

చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చాయి. 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు నుండి రూ. 51.50 తగ్గింది. 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. మార్చి నెల మినహా, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు జనవరి 1, 2025 నుండి నిరంతరం తగ్గుతున్నాయి. జనవరి 1న దీనిని రూ.14.50 తగ్గించారు. దీని తర్వాత ఫిబ్రవరిలో రూ.7 తగ్గింది.

మార్చి 1న ధరలను రూ.6 పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.41 తగ్గించారు. దీని తర్వాత మే 1న రూ.14, జూన్ 1న రూ.24 చొప్పున తగ్గించారు. జూలై 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.58.50 చొప్పున తగ్గించారు. దీని తర్వాత ఆగస్టు 1న మళ్లీ రూ.33.50 చొప్పున తగ్గించారు. ఇప్పుడు మరోసారి ధరలు తగ్గించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి