Gas Cylinder Price: 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలివే..

|

Apr 05, 2023 | 1:48 PM

‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్న’ పాట ప్రస్తుత పరిస్థితులకు వాస్తవ రూపంగా నిలిస్తోంది. అయితే, ఈ అధిక ధరల బెడద నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దేశమంతా రూ. 1200 గ్యాస్ సిలిండర్‌ను..

Gas Cylinder Price: 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలివే..
Gas Price
Follow us on

‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్న’ పాట ప్రస్తుత పరిస్థితులకు వాస్తవ రూపంగా నిలిస్తోంది. అయితే, ఈ అధిక ధరల బెడద నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దేశమంతా రూ. 1200 గ్యాస్ సిలిండర్‌ను.. అర్హులైన ప్రజలకు రూ. 500 లకే ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఖజానాపై ఏటా రూ. 750 కోట్ల అదనపు భారం పడుతున్నా.. ప్రజల సౌకర్యమే ముఖ్యమంటోంది ప్రభుత్వం. నిర్ణీత ధరకు అంతకు మించి రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. మరి 500 లకే గ్యాస్ సిలిండర్‌ ఎక్కడ లభిస్తోంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే ఏం చేయాలి?..

రాజస్థాన్ నివాసి అయి, దారిద్ర్య రేఖకు(BPL) దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వారైతే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. సబ్సిడీ పొందడానికి లబ్దిదారులు తమ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా లింక్ చేయకపోతే ఈ సబ్సిడీ ప్రయోజనం పొందలేదు. ఈ పథకాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించింది.

ఖాతాలో సబ్సిడీ..

అయితే, వినియోగదారులు గ్యాస్ కొనుగులో చేసే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్సిడీ డబ్బు వారి వారి ఖాతాల్లో జమ అవుతుంది. తద్వారా అర్హులైన వారికి రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా రాజస్థాన్‌లోని 73 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇందులో 69.20 లక్షల మంది ఉజ్వల పథకం లబ్ధిదారులు, 3.80 లక్షల బిపిఎల్ కుటుంబాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..