75 ఏళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు.. మాటల్లో తెల్పలేని ఉద్విగ్నక్షణాలు

|

May 23, 2023 | 8:35 AM

75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఓ అక్కా, తమ్ముడిని సోషల్‌ మీడియా కలిపింది. సినిమాటిక్‌గా ఉన్న వీరి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది..

75 ఏళ్ల తర్వాత కలుసుకున్న తోబుట్టువులు.. మాటల్లో తెల్పలేని ఉద్విగ్నక్షణాలు
Mahendra Kaur And Sheikh Abdul Aziz
Follow us on

75 ఏళ్ల క్రితం దేశ విభజన సమయంలో విడిపోయిన తోబుట్టువులు మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఓ అక్కా, తమ్ముడిని సోషల్‌ మీడియా కలిపింది. సినిమాటిక్‌గా ఉన్న వీరి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

భారత్‌కు చెందిన 81 ఏళ్ల మహేంద్ర కౌర్ (అక్క), పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన 78 ఏళ్ల షేక్ అబ్దుల్ అజీజ్‌ (తమ్ముడు)లతే ఈ కథ. వీరి చిన్న తనంలో 1947లో జరిగిన దేశ విభజన సమయంలో సర్దార్ భజన్ సింగ్ కుటుంబం చెల్లా చెదురైంది. ఆ సమయంలో అజీజ్‌ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు తరలించబడ్డాడు. అతని తల్లిదండ్రులతోపాటు అక్క మహేంద్ర భారత్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత అజీజ్‌ చిన్న వయసులో వివాహం చేసుకున్నాడు. నాటి నుంచి అతను కాశ్మిర్‌లోనే ఉండిపోయాడు. కానీ ఎప్పటికైనా తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవాలనే కోరిక మాత్రం అతనిలో బలంగా ఉండిపోయింది.

ఇటీవల ఓ సోషల్ మీడియా పోస్టు ఇరువురి కుటుంబాలను కలిపాయి. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా కారిడార్‌ ద్వారా దర్బార్ సాహిబ్‌ వద్ద ఆదివారం అక్కాతమ్ముడు కలుసుకున్నారు. అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అజీజ్‌లు ఆనంద బాష్పాలు, ఆలింగనాలతో ఉద్విగ్నులయ్యారు. పక్కపక్కనే కూర్చుని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని మురిసిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.