అప్పుడు కరోనా కంటే ఆ‌ మరణాలే ఎక్కువవుతాయి: ‘ఇన్ఫీ’ నారాయణ మూర్తి

| Edited By:

Apr 30, 2020 | 6:32 PM

కరోనా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌ వలనే ఎక్కువ మంది చనిపోతారని ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

అప్పుడు కరోనా కంటే ఆ‌ మరణాలే ఎక్కువవుతాయి: ఇన్ఫీ నారాయణ మూర్తి
Follow us on

కరోనా వైరస్‌ కంటే లాక్‌డౌన్‌ వలనే ఎక్కువ మంది చనిపోతారని ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. లాక్‌డౌన్ ఇలానే పొడిగిస్తే చాలామంది ఆకలితో అలమటిస్తారని ఆయన అన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారిని రక్షించుకోవాలని.. ఆరోగ్యంగా, సామర్థ్యం ఉన్న వారిని తిరిగి పనిని ప్రారంభించే విధంగా వీలు కల్పించాలని సూచించారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయని నారాయణ మూర్తి వెల్లడించారు.

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం ఉందని.. ఇది మిగిలిన అభివృద్ధి చెందిన దేశాల్తో పోలిస్తే చాలా తక్కువేనని ఆయన అన్నారు. ”భారత్‌లో లాక్‌డౌన్‌ ఇలాగే కొనసాగిస్తే ఆ పరిస్థితిని మనం అంచనా వేయడం చాలా కష్టం. అప్పుడు ఆకలితో చనిపోయేవారే ఎక్కువగా ఉంటారు” అని నారాయణ మూర్తి తెలిపారు. సాధారణంగానే దేశంలో పలు కారణాల వలన సంవత్సరానికి 9 మిలియన్‌ ప్రజలు మరణిస్తున్నారని.. కానీ కరోనా వలన రెండు నెలల్లో 1000 మంది మరణించారని.. దీన్ని బట్టి చూస్తే అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఇక లాక్‌డౌన్ కొనసాగిస్తే.. చాలా మంది ఉపాధిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని కూడా నారాయణ మూర్తి హెచ్చరించారు. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలని ఆయన వ్యాపార వర్గాలకు సూచించారు.

Read This Story Also: ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త ఆత్మహత్య.. ప్రకటించిన పోలీసులు..!