ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త ఆత్మహత్య.. ప్రకటించిన పోలీసులు..!
ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త జోయ్ అరక్కల్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 23న బిజెనెస్ బేలోని ఓ బిల్డింగ్ నుంచి దూకి ఆయన తనువు చాలించారు.

ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త జోయ్ అరక్కల్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 23న బిజెనెస్ బేలోని ఓ బిల్డింగ్ నుంచి దూకి ఆయన తనువు చాలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగదిర్ అబ్దుల్లా ఖదీమ్ బిన్ సోరర్ ప్రకటించారు. మొదట గుండెపోటు అనుకున్నప్పటికీ.. దర్యాప్తు తరువాత అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చేశారు. కాగా కేరళలోని వాయ్‌నాడ్‌కు చెందిన జోయ్ అరక్కల్.. గత 20 సంవత్సరాలుగా దుబాయ్‌లో ఆయిల్ సెక్టార్‌కు సంబంధించిన బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల ఆయన తన వ్యాపారాల్లో బాగా నష్టపోయారు
గత కొన్ని రోజులుగా జోయ్ అరక్కల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన సన్నిహితుల్లో ఒకరు వెల్లడించారు. పెట్రోలియం బిజినెస్, షిప్పింగ్‌ల్లో జోయ్ తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. కాగా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిన తరువాత అరక్కల్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో కోళికోడ్‌కు తరలించారు.
Read This Story Also: బ్యాంక్ స్కామ్.. చంద్రబాబు పీఏపై ఫిర్యాదు..!