LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

|

Jul 03, 2024 | 11:05 PM

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్..

LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Lk Advani
Follow us on

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్ యూరాలజీ విభాగంలో చేరారు. అద్వానీ పరిస్థితి మెరుగుపడడంతో, మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అద్వానీకి ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డు లభించింది. 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా, శక్తివంతమైన వక్తలలో అద్వానీ కూడా ఉన్నారు. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పని చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి