High Court Verdict: సహజీవనంపై హైకోర్టు సంచలన తీర్పు.. రక్షణ కల్పించాలన్న ప్రేమ జంటకు చుక్కెదురు..

|

May 18, 2021 | 5:40 PM

High Court Verdict: సహజీవనంపై పంజాబ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన..

High Court Verdict: సహజీవనంపై హైకోర్టు సంచలన తీర్పు.. రక్షణ కల్పించాలన్న ప్రేమ జంటకు చుక్కెదురు..
1
Follow us on

High Court Verdict: సహజీవనంపై పంజాబ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ ప్రేమ జంటకు చుక్కెదురు అయింది. సహజీవనం నైతికంగా, సామాజికంగా అమోదభాగ్యం కాదంటూ వారు వేసిన పిటిషన్‌ను పంజాబ్, హరియాణా హైకోర్టు తిరస్కరించింది. వివరాల్లోకి వెళ్తే..

కొన్నాళ్లుగా 19 ఏళ్ళ గుల్జా కుమారి, 21 ఏళ్ళ గుర్వీందర్ సింగ్ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నామని, కుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మదాన్‌.. ” పిటిషనర్లు తమ బంధానికి ఈ పిటిషన్ ద్వారా చట్టబద్ధత కోరుతున్నారు. ఇది నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని” అన్నారు. ఈ సందర్భంలో ఉత్తర్వులు జారీ చేయలేమని జస్టిస్ మదన్‌ పిటిషన్‌ను కొట్టేశారు.

పిటిషనర్ల తరపున లాయర్ మాట్లాడుతూ కుమారి తల్లిదండ్రులు సహజీవనాన్ని అంగీకరించలేదన్నారు. కుమారి వయసును ధ్రువీకరించే ఆధార్‌ కార్డు వారి దగ్గర ఉండటంతో ఈ జంట వివాహం చేసుకోలేకపోయిందని అన్నారు. సహజీవనాన్ని సుప్రీంకోర్టు ఇదివరకు సమర్థించింది. వారికి వివాహం అయ్యే వరకు ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడాలని హైకోర్టును ఆశ్రయించాం. అమ్మాయి కుటుంబం ఆగ్రహానికి భయపడి ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు అని న్యాయవాది ఠాకూర్‌ కోర్టుకు వివరించారు. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తే నేరంకాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు విరుద్ధంగా పంజాబ్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..