బిహార్‌ను వదలని పిడుగులు.. ఏడుగురు మృతి..

| Edited By:

Jul 07, 2020 | 11:58 PM

బిహార్‌పై ప్రకృతి కన్నెర చేస్తోంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రజల్ని గజగజ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా బిహార్‌లోని పలు జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి.దీంతో..

బిహార్‌ను వదలని పిడుగులు.. ఏడుగురు మృతి..
Follow us on

బిహార్‌పై ప్రకృతి కన్నెర చేస్తోంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రజల్ని గజగజ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా బిహార్‌లోని పలు జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి.దీంతో అనేక మంది సామాన్య ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా మంగళవారం పలుజిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడి ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని బిహార్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. బెగుస‌రాయ్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మరణించారు. ఇక భాగ‌ల్‌పూర్‌, ముంగ‌ర్‌, కైమూర్‌, జ‌ము జిల్లాల్లో ఒక్కొక్క‌రు మరణించారు.

కాగా, గడిచిన వారం రోజులుకు పైగా.. రాష్టంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పిడుగులు కూడా పడుతుండటంతో.. అనేక మంది ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటికే దాదాపు వంద మందికి పైగా పిడుగులు పడి మరణించినట్లు తెలుస్తోంది. వీరికి బిహార్‌ ప్రభుత్వం రూ.4లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. అయితే మంగళవారం మరణించిన వారికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నష్ట పరిహారాన్ని ప్రకటించలేదు.