Viral: బావి నుంచి వింత శబ్దాలు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్.. ఆందోళనలో గ్రామస్థులు

|

Jun 08, 2022 | 11:32 AM

అడవుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. విచక్షణ రహితంగా చెట్లు కొట్టేస్తుండంతో వన్యప్రాణులకు ఆవాసం కరవవుతోంది. దీంతో అడవుల్లో ఉండే అవకాశం లేకపోవడంతో అవి గాడి తప్పుతున్నాయి. ఆహారం కోసం...

Viral: బావి నుంచి వింత శబ్దాలు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్.. ఆందోళనలో గ్రామస్థులు
Leopard
Follow us on

అడవుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. విచక్షణ రహితంగా చెట్లు కొట్టేస్తుండంతో వన్యప్రాణులకు ఆవాసం కరవవుతోంది. దీంతో అడవుల్లో ఉండే అవకాశం లేకపోవడంతో అవి గాడి తప్పుతున్నాయి. ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఇలా బయటకు వచ్చిన వన్యప్రాణులకూ ముప్పు తప్పుట్లేదు. తాజాగా మహారాష్ట్ర పుణెలోని (Pune) ఓ గ్రామంలో చిరుతపులి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. తమ ప్రాంతంలోకి పులి వచ్చిందని, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని భయపడ్డారు. కానీ ఆ చిరుత (Leopard) అరుపులు ఓ బావిలోంచి వస్తున్నట్టు గ్రహించిన గ్రామస్తులు పరుగు పరుగున అక్కడికి వెళ్లారు. ఆ గ్రామంలోని ఓ 45 అడుగుల లోతున్న బాలిలో పడిపోయి, మునిగిపోయే పరిస్థితిలో ఉన్న చిరుతను చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ, వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌కు సమాచారమిచ్చారు.

గ్రామ‌స్తుల స‌మాచారంతో అట‌వీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ స‌భ్యులు బావి వ‌ద్దకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించి మంచానికి నాలుగువైపులా తాళ్లు క‌ట్టి బావిలోకి దింపారు. దాంతో ఆ చిరుత‌పులి ఆ మంచంపైకి ఎక్కింది. అనంత‌రం దాన్ని సురక్షితంగా పైకి లాగి, వైద్య ప‌రీక్షల కోసం మానిక్‌దో కేంద్రానికి తరలించారు. పశువైద్య బృందం ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించడంతో, చిరుతపులిని తిరిగి దాని నివాస స్థానంలో వ‌దిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి