Viral: జైల్లో నిమ్మకాయల స్కామ్.. హాంఫట్ ఆఫీసర్ సస్పెండ్.. ఇది మాములు యవ్వారం కాదు

|

May 08, 2022 | 1:31 PM

ధర కొండెక్కడంతో నిమ్మకాయపై రకరకాల మీమ్స్‌ వస్తున్నాయి. ఓ జైలులో ఏకంగా నిమ్మకాయల స్కామే జరిగింది. అదేంటో తెలుసుకుందాం పదండి.

Viral: జైల్లో నిమ్మకాయల స్కామ్.. హాంఫట్ ఆఫీసర్ సస్పెండ్.. ఇది మాములు యవ్వారం కాదు
Lemon Scam
Follow us on

Lemon scam: నేరస్తుల్లో పరివర్తన తీసుకురావల్సిన జైలు అధికారే తప్పు చేశాడు. అదీ నిమ్మకాయల పేరుతో!. ఈ స్కాం జరిగింది పంజాబ్‌లోని కపుర్తలా మోడర్న్‌ జైలులో! ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ జైలును తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు లెమన్‌తో నిధులు ఎలా కొట్టేసిందీ బయటపడింది. గత నెలలో నిమ్మకాయల ధర ఆకాశాన్నిఅంటుతున్నప్పుడు ఈ స్కాం జరిగింది. అప్పడు నిమ్మకాయల ధర కిలో 200 రూపాయలు ఉంది. అదే అదనుగా భావించిన జైలు అధికారి 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్టు బిల్లులు సృష్టించారు. నిజానికి నిమ్మకాయలు కొన్నదీ లేదు. ఖైదీలకు ఇచ్చిందీ లేదు. తనిఖీ బృందం జైలుకి వచ్చినప్పుడు ఆరా తీస్తే తమకు నిమ్మకాయలు ఇవ్వలేదని ఖైదీలు చెప్పారు. దాంతో విచారణకు ఆదేశించారు పంజాబ్‌ జైళ్ల శాఖ మంత్రి హర్‌జ్యోత్‌ సింగ్‌.  జైలు సూపరింటెండెంట్‌ గుర్నామ్‌ లాల్‌ పలు అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఖైదీలకు పెడుతున్న చపాతీ ఒక్కోటీ కనీసం 50 గ్రాములు కూడా ఉండటం లేదని అధికారులు గుర్తించారు. దీంతో గోధుమ పిండిని కూడా సూపరింటెండెంట్‌ దారి మళ్లిస్తున్నారని విచారణ అధికారులు కన్ఫామ్‌ చేసుకున్నారు. కూరగాయల కొనుగోలులో కూడా ఆయన చేతివాటం ఎక్కువగా ఉందని కనిపెట్టారు. ఖైదీలకు ఫుడ్‌ అరకొరగా పెడుతున్నారని, అదీ క్వాలిటీ ఉండటం లేదని కూడా గుర్తించారు. వెంటనే ఆయనను సస్పెండ్‌ చేసింది పంజాబ్‌ ప్రభుత్వం. నిమ్మకాయల పేరుతో పది వేలు కొట్టేస్తే… అక్రమాల చిట్టా అంతా బయటపడి జాబ్‌ ఊడింది ఆ సూపరింటెండెంట్‌కు!.

Also Read: Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..