Landslide: ఉత్తర భారతావనిని కొన్నిరోజులుగా వర్షాలు వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటం. నదులు పొంగి పొర్లడం.. రోడ్లు కొట్టుకుపోవడం వంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. భారీగా ఆస్తినష్టం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లలో వర్షం.. మేఘాలు బద్దలవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో జాతీయరహదారి తెగిపోయింది. ఈ సంఘటన రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలోని మారుమూల షిలై ఉపవిభాగంలోని కాళి ఖాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడ రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిర్మూర్‌లోని పావోంటా సాహిబ్ ప్రాంతంతో షిలైని కలిపే నేషనల్ హైవే 707 తెగిపోయింది. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
“సిర్మౌర్ జిల్లాలోని సతౌన్ సమీపంలో కాచి ధంక్ వద్ద రహదారి మునిగిపోయింది. ఈ ప్రాంతంలో 200 మీటర్ల రహదారి ఈ ప్రాంతంలో అనేక అడుగుల మునిగిపోయింది” అని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ శర్మ చెప్పారు.
సిర్మౌర్ జిల్లాలోని పోంటాను సిమ్లా జిల్లాలోని హట్కోటికి ఎన్‌హెచ్ -707 కలుపుతుంది. రహదారి మునిగిపోయిన ప్రదేశం రాష్ట్ర రాజధాని సిమ్లా నుండి దాదాపు 165 కి. జిల్లా ప్రజలు డెహ్రాడూన్, న్యూ ఢిల్లీ చేరుకోవడానికి ఇది అతి దగ్గర మార్గం.
కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాన్ని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కొండచరియలు విరిగిపడుతున్నప్పటి భయానక దృశ్యం రికార్డు అయింది. ఈ ట్వీట్ ట్రేండింగ్ అవుతోంది. ఇది చూసిన వారంతా ట్విట్టర్ లో కామెంట్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఆ ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు..
Terrifying. Landslide in a remote part of Himachal’s Sirmaur district. (Via @manjeet_sehgal/@IndiaToday) pic.twitter.com/GIYgafxxCn
— Shiv Aroor (@ShivAroor) July 30, 2021
ఇక అటు జమ్మూకశ్మీర్‌లోని పలు జిల్లాల్లో సంభవించిన మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్), భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు చాలా మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. రెస్క్యూ టీమ్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. వదరల్లో కొట్టుకుపోయిన చాలా మందిని రక్షించారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలాలకు బయలుదేరి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్గిల్ జిల్లా, కిష్త్వా జిల్లా తదితర జిల్లాల్లో భారీగా వరదలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: Cloudbrust: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?.. జమ్మూలో భారీగా వరదలు.. ముంచెత్తుతున్న వర్షాలు
5G Network: స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పోతో జతకట్టిన రిలయన్స్ జియో.. 5జీ నెట్ వర్క్ కోసం పరీక్షలు..!