Land dispute: దారుణం: భగ్గుమన్న భూ వివాదం.. ఐదుగురు మహిళలపై కాల్పులు

|

Dec 26, 2022 | 7:28 AM

పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. ఇది ఎవరి భూమి అని తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. కాల్పుల కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలిసింది.

Land dispute: దారుణం: భగ్గుమన్న భూ వివాదం.. ఐదుగురు మహిళలపై కాల్పులు
Landdispute
Follow us on

బీహార్‌లోని బెట్టియా జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంలో భూ వివాదంలో ఐదుగురు మహిళలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పశ్చిమ చంపారన్ జిల్లా నక్తి పట్వారా గ్రామంలో భూమి సమస్యపై మహిళలు నిరసనలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భూమిలేని కూలీలకు 1985లో ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. భూమి తమదేనని భూ నిర్వాసితుల వాదన. ప్రస్తుతం ఈ కేసు 2004 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు.

అయితే, గతంలో భూ యజమానిగా ఉన్న శిశిర్ దూబే ట్రాక్టర్ తీసుకొచ్చి బలవంతంగా పొలాన్ని దున్నేందుకు ప్రయత్నించాడని తెలిసింది. దాంతో స్థానికంగా ఉంటున్న మహిళలు నిరసన తెలపడంతో శిశిర్‌ దూబే వారిపై తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సద్దుమనిగేలా చేశారు. ఘటనా స్థలంలో పోలీసు బృందాలను మోహరించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. ఇది ఎవరి భూమి అని తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. కాల్పుల కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఫోరెన్సిక్ విభాగం పరిశీలించి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉపేంద్రనాథ్ వర్మ తెలిపారు. మహిళలు బెట్టి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి