MP Sentenced to Jail: కోర్టు సంచలన తీర్పు.. హత్యాయత్నం నేరంలో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష!

|

Jan 12, 2023 | 11:47 AM

హత్యాయత్నం నేరం కింద ఎంపీతోపాటు నలుగురు వ్యక్తులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు బుధవారం (జనవరి 10) తీర్పు వెలువరించింది..

MP Sentenced to Jail: కోర్టు సంచలన తీర్పు.. హత్యాయత్నం నేరంలో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష!
Lakshadweep MP
Follow us on

హత్యాయత్నం నేరం కింద ఎంపీతోపాటు నలుగురు వ్యక్తులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు లక్షద్వీప్‌ కోర్టు బుధవారం (జనవరి 10) తీర్పు వెలువరించింది. 2009లో లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన మహ్మద్‌ సాలిహ్‌ను హత్య చేసేందుకు లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌తో సహా మరో ముగ్గురు యత్నించారు. లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌తోపాటు మరో 36 మంది నిందితులు మారణాయుధాలతో సాలిహ్‌, అతని స్నేహితుడు మహ్మద్ కాసిమ్‌ను ఆండ్రోత్ ద్వీపంలోని ఒక ప్రదేశంలో నిర్భందించి దారుణంగా గాయపరిచారు. అనంతరం సాలిహ్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఫైజల్‌తోపాటు మరో ముగ్గురు సాలిహ్‌ను వెంబడించారు. ఈ క్రమంలో సాలిహ్‌ ఓ ఇంట్లో తలదాచుకోగా.. ఆ ఇంటి గోడలను పగులగొట్టిమరి, అతన్ని కత్తులతో దారుణంగా పొడిచారు. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయీద్ బాధితుడిని కేరళలోని ఎర్నాకులంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స నందించారు. అప్పట్లో వీరిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. వీరికి జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో దోషులంతా బంధువులు కావడం కొసమెరుపు.

రాజకీయ కక్షలతో సాలిహ్‌ను హత్యాప్రయత్నం చేసినట్లు రుజువైనందున ఈ కేసులో వారిని దోషులుగా కోర్టు పేర్కొంది. దాంతో ఎంపీ ఫైజల్‌తో సహా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, త్వరలో కేరళ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయనున్నట్లు ఫైజల్ పేర్కొన్నాడు. ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులుగా ఉన్నారు. ఇక ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడటంతో అతనిపై అనర్హత వేటు పడింది. అతడి రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఫైజల్‌పై అనర్హత వేటుపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.