ఢిాల్లీ: జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తెచ్చిన తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ బీజేపీ యువ ఎంపీ స్పీచ్‌కి పార్లమెంట్ చప్పట్లతో నిర్విరామంగా అభినందనలు తెలిపారు. లడఖ్ బీజేపీ ఎంపీ జమ్‌యాంగ్ షేరింగ్ నమగ్యాల్ మాట్లాడుతూ..లడఖ్ ప్రజలు తమ ప్రాంతానికి కేంద్ర పాలిత హోదా కల్పించడంపై ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. లడఖ్ వెనకబాటుతనానికి ఆర్టికల్ 370, కాంగ్రెస్ పార్టీలే కారణం అని ఆ ఎంపీ విమర్శలు చేశారు. ఈ యువ ఎంపీ స్పీచ్‌కి ప్రదాని మోదీ సైతం ఫిదా అయ్యారు.
జమ్‌యాంగ్ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ..లడఖ్ బీజేపీ ఎంపీ అక్కడి ప్రజల ఆకాంక్షలను తన ప్రసంగంలో వెల్లడించారని మోదీ ట్వీట్ చేశారు. ‘నా యువ స్నేహితుడు జమ్‌యాంగ్ షేరింగ్ నమగ్యాల్ జమ్ముకశ్మీర్‌కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. లడఖ్‌లోని మన సోదరీసోదరమణుల ఆకాంక్షలను ప్రతిఫలించేలా ఆయన ప్రసంగించారు. ఇది తప్పకుండా వినాల్సిన స్పీచ్’ అని మోదీ ట్వీట్ చేశారు.
My young friend, Jamyang Tsering Namgyal who is @MPLadakh delivered an outstanding speech in the Lok Sabha while discussing key bills on J&K. He coherently presents the aspirations of our sisters and brothers from Ladakh. It is a must hear! https://t.co/XN8dGcTwx6
— Narendra Modi (@narendramodi) August 6, 2019