అక్కడివారికోసం భగవంతుడిని ప్రార్ధించండి..దయచేసి బయటకు రాకండి. ఎమోషనల్ అయిన కుష్బూ

|

Nov 25, 2020 | 7:27 PM

ఇప్పటికే ఈ  ఏడాది కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నిప్పుడిప్పుడే దానినుంచి తేరుకుంటున్న ప్రజలకు మరో ముప్పు పొంచివుంది...

అక్కడివారికోసం భగవంతుడిని ప్రార్ధించండి..దయచేసి బయటకు రాకండి. ఎమోషనల్ అయిన కుష్బూ
Follow us on

ఇప్పటికే ఈ ఏడాది కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నిప్పుడిప్పుడే దానినుంచి తేరుకుంటున్న ప్రజలకు మరో ముప్పు పొంచివుంది. తీవ్రమైన తుఫానుగా మారిన ‘నివర్’ తమిళనాడు వైపుకు దూసుకువస్తోంది. బుధవారం రాత్రి  లేదా గురువారం తెల్లవారు జామున మమ్మళ్లపురం, కరైకల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.దాంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే సహాయక చర్యలు కూడా మొదలు పెట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నేత కుష్బూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ” 2020 ఇప్పటికే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తుఫాను దూసుకువస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరు కూడా బయటకు వెళ్లొద్దు. ప్రతి సంవత్సరం తమిళనాడులో తుఫాన్ వస్తుంది. అది భారీ నష్టాన్ని మిగులుస్తుంది. ఇప్పుడు నివర్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి , బలమైన గాలులు వీస్తున్నాయి, చెట్లు నేలరాలుతున్నాయి , రోడ్లన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం కూడా సెలవలు ప్రకటించింది. ఈ రోజు రాత్రి తుఫాన్ చెన్నై, పాండిచ్చేరి మధ్యలో రానుంది. ఆ ప్రాంతంలో ప్రజలకోసం అందరం ప్రార్ధిద్దాం..దయచేసి ఎవ్వరు బయటకు రావద్దు, మనకోసం మనవళ్ల కోసం జాగ్రత్తగా ఉందాం.. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు కుష్బూ.