Viral: ఇంట్లోనే ‘హిమాలయన్​ వయాగ్రా’ పంట.. ఆ రైతు సుడి తిరిగింది.. ఏకంగా లక్షల్లో

|

Aug 03, 2022 | 10:19 PM

ఓ రైతు శ్రమకు ఫలితం లభించింది. అతను ఇంట్లోనే చేసిన కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. అత్యంత అరుదుగా 'హిమాలయన్​ వయాగ్రా' పండించి లక్షలు ఆర్జించబోతున్నాడు ఓ రైతు.

Viral: ఇంట్లోనే హిమాలయన్​ వయాగ్రా పంట.. ఆ రైతు సుడి తిరిగింది.. ఏకంగా లక్షల్లో
Keeda Jadi
Follow us on

Trending: హిమాలయాలు అంటే కేవలం సౌందర్యం మాత్రమే కాదు. అత్యంత అరుదైన ఎన్నో విలువైన మొక్కలు, చెట్లకు ఆవాసం. అందులో ‘కీడా జడీ’ కూడా ఒకటి. ఇది అడవి జాతికి చెందిన పుట్ట గొడుగు మొక్క. దీన్ని’హిమాలయన్​ వయాగ్రా’ అని కూడా అంటారు. ఇంగ్లీషులో క్యాటర్​పిల్లర్​ ఫంగస్ అని పిలుస్తారు. హిమగిరుల్లో సముద్ర మట్టానికి 3,600-5000 మీటర్ల హైట్‌లో వెరీ రేర్‌గా పెరిగే ఈ మొక్కను ఇంట్లోనే ఓ ల్యాబ్ ఏర్పాటు చేసి పెంచాడు హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) కుల్లూ(Kullu)కు చెందిన ఓ రైతు. అతని పేరు గౌరవ్ శర్మ. ఇప్పుడు ఈ రైతు టాక్ ఆఫ్‌ ద స్టేట్‌గా మారాడు. వివిధ రకాల మెడిసిన్స్‌లో ఈ మూలిక మొక్కను విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా సెక్యూవల్ కెపాసిటీ పెంచే నేచురల్ స్టెరాయిగా పనిచేస్తుందని కొందరు చెబుతున్నారు. చైనా సహా ఫారెన్ కంట్రీస్‌లో కీడా జడీకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఫారెన్ కంట్రీస్‌లో కేజీ ధర 30 నుంచి 35 లక్షలు వరకు ఉంటుంది. దీని ప్రాముఖ్యత తెలియకపోవడంతో.. దేశీయంగా రూ.3-5లక్షలు మధ్యే ధర పలుకుతుంది. మలేషియాలో ఉండే ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు గౌరవ్ శర్మ తన ఇంట్లోనే ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. గత సంవత్సర కాలంలో ఈ మొక్కల గురించి అధ్యయనం చేశాడు. అతని శ్రమ ఫలించింది. తాజాగా 45 రోజుల్లో హిమాలయన్​ వయాగ్రా పంటను పండించాడు. ఫస్ట్ ఫేజ్‌లో 3వేల బాక్సుల పంటను బెంగళూరులోని ఓ కంపెనీకి అమ్మబోతున్నట్లు రైతు చెప్పాడు. తమ ప్రాంతంలోని రైతులకు దీని గురించి అవగాహన కల్పిస్తానని రైతు గౌరవ్ శర్మ తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి