బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ‘శక్తి పథకం’ రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. ఈ పథకం ద్వారా ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల మహిళల పట్ల రవాణా శాఖ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రజల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై కర్ణాటక ఆర్టీసీ బస్ కండక్టర్ చేయి చేసుకోవడం చర్చణీయంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కేఎస్‌ఆర్ టీసీ సిబ్బంది ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో గత శుక్రవారం (జూన్ 23) కర్ణాటకలోని హుబ్బళి బస్సులో ఓ వృద్ధ మహిళను మహిళా కండక్టర్ చెంపదెబ్బ కొట్టింది. మిగతా ప్రయాణికులు ప్రశ్నించగా సదరు కండక్టర్ వారిని కూడా కన్నడలో తిట్టడం ప్రారంభించింది. కుండల్ నుంచి హుబ్లీకి వెళ్లున్న కర్ణాటక ఆర్జీసీ బస్సులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ಹುಬ್ಬಳ್ಳಿ| ಅಜ್ಜಿ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿದ ಲೇಡಿ ಕಂಡಕ್ಟರ್ !!#News18Kannada #FreeBusTravel #shaktischeme #CongressGuarantee @BJP4Karnataka @RLR_BTM pic.twitter.com/ld521kHs29
— News18 Kannada (@News18Kannada) June 23, 2023
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వృద్ధురాలిని చెంపదెబ్బ కొట్టిన కండక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వం బస్సు డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించింది. ప్రతి బస్టాప్ వద్ద బస్సులను నిలపాలని, బస్సుల్లో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.