Affair: కూతురుతో ప్రేమ.. తల్లితో అఫైర్.. చివరకు శవమై తేలిన యువకుడు.. కత తెలిస్తే షాకే..

|

Oct 09, 2022 | 6:43 PM

యువతితో పాటు, ఆమె తల్లితోనూ అఫైర్ నడిపాడు. చివరకు పండుగ పూట ఆ కుటుంబం చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు ఓ యువకుడు.

Affair: కూతురుతో ప్రేమ.. తల్లితో అఫైర్.. చివరకు శవమై తేలిన యువకుడు.. కత తెలిస్తే షాకే..
Illegal Affair
Follow us on

యువతితో పాటు, ఆమె తల్లితోనూ అఫైర్ నడిపాడు. చివరకు పండుగ పూట ఆ కుటుంబం చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు ఓ యువకుడు. అయితే, హత్య వెనుక పెద్ద మిస్టరీనే ఉంది. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రాహట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు తేల్చిన ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మగ్రాహట్‌కు చెందిన మృతుడు అయాన్ మోండల్(21).. ఓ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే సమయంలో యువతికి తెలియకుండా ఆమె తల్లితో కూడా అఫైర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో విజయ దశమి రోజున సాయంత్రం తన ప్రేయసిని కలిసేందుకు ప్రయత్నించాడు. ముందుగా ఆమెకు పలుసార్లు ఫోన్ కాల్ చేశాడు. అయితే, ఆయువతి ఫోన్ ఆన్సర్ ఇవ్వకుండా కట్ చేసింది. దాంతో కోపోద్రిక్తుడైన యువకుడు.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అయాన్ మోండల్.. ఇంట్లో ఉన్న యువతి తల్లితో ఘర్షణకు దిగాడు. ఆమెపై దాడి చేశాడు. వెంటనే స్పందించిన అతని ప్రియురాలు, ఆమె సోదరుడు, తండ్రి ముగ్గురూ వచ్చి అయాన్‌ మోండల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి సోదరుడు అయాన్ మోండల్ తలపై ఆయుధంతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తీవ్రంగా గాయపడిన అయాన్.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాలు వదిలాడు. అయాన్ హత్య బయటకు పొక్కుండా ఉండేందుకు అతని మృతదేహాన్ని రహస్యంగా మగ్రాహత్ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశారు.

అయితే, పండుగ తెల్లారి అయాన్ మోండల్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతని కోసం గాలిస్తున్న క్రమంలో.. మృతదేహం లభ్యమైంది. అతని ఫోన్, క్లూస్ ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు అసలు మ్యాటర్‌ను రాబట్టారు. అయాన్ మోండల్‌ను హతమార్చిన అతని ప్రియురాలు, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, మరో ఇద్దరు యువకులు సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. మృతుడు అయాన్‌కి యువతితో పాటు, ఆమె తల్లితో అఫైర్ ఉందని, ఆ అఫైర్ కారణంగా గొడవలు జరుగుతుండేవని తేల్చారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..