బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తన సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై కోల్ కతా పోలీసులు ఆయనను బుధవారం విచారించారు. ఈ విచారణకు ఆయన వర్చ్యువల్ గా హాజరయ్యారు. తాను నటించిన కొన్ని బెంగాలీ చిత్రాల్లోని డైలాగులను మిథున్ చక్రవర్తి….ప్రచారం సందర్భంగా వాడారని, అవి రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయంటూ బెంగాలీ సినీ పరిశ్రమకే చెందిన ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాకీలు దీన్ని ఆ తరువాత ఎఫ్ ఐ ఆర్ గా మార్చారు. అయితే ఇందులో తన తప్పు లేదని, ఈ ఎఫ్ ఐ ఆర్ ని కొట్టివేయాలని కోరుతూ మిథున్ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పోలీసులకు సహకరించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోర్టు ఆయనను ఆదేశించింది. దీనిపై ..మిథున్.. ఈ డైలాగులు తనవి కావని, కొన్ని బెంగాలీ చిత్రాల్లోనివని పోలీసులకు చెప్పారు. ఇందులో తనకు దురుద్దేశాలు ఆపాదించవద్దని కోరారు. చిత్రాల లోని సంభాషణలతో ప్రజలను రెచ్చగొట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ చాలాసేపు కొనసాగింది.
బెంగాల్ ఎన్నికల్లో మిథున్ ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి తరఫున ప్రచారం చేశారు.. ఆ సందర్భంగా తన సినీ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆ నియోజకవర్గ ఎన్నికల్లో సువెందు అధికారి స్వల్ప తేడాతో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీపై నెగ్గారు. కాగా ఈ కేసు విచారణను కలకత్తా హైకోర్టు ఈ నెల 18 కి వాయిదా వేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
Post Office Jobs: పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి