కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత పొందడానికి ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవు. ఇందుకోసం రేషన్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆధార్‌ను కూడా సమర్పించాలి. పీఎం కిసాన్ యోజన తదుపరి విడత పొందడానికి రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీ కాకుండా పీడీఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం రేషన్ కార్డ్ కాపీని సమర్పించాలి. రేషన్ కార్డు హార్డ్ కాపీకి బదులు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి.
రేషన్‌కార్డు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, మునుపటిలా సాఫ్ట్ కాపీ ఫోటోస్టాట్ ఇవ్వడం వల్ల పనిచేయదు. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) అగ్రికల్చర్ బీహార్ వెబ్‌సైట్ ప్రకారం “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. లేకుంటే వారు పథకం ప్రయోజనాలను కోల్పోతారు”
పీఎం కిసాన్ ప్రయోజనాలు:
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున 12 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 2022లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వ విడత మొత్తాన్ని రైతుల ఖాతాకు బదిలీ చేశారు. 13వ విడత రావాలంటే ఈకేవైసీ చేయని వారు వెంటనే ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది.
పథకం లబ్ధిదారునిగా నమోదు చేయించుకోవడానికి అవసరమైన సమాచారం: