
ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన భారతదేశం 3వ స్థానం కోసం వడివడిగా పరుగులు పెడుతోంది. అయితే మిగతా ప్రపంచంపై ఆధిపత్యం లేదా ప్రభావం చూపాలంటే కేవలం ఆర్థిక శక్తి మాత్రమే సరిపోదు. సైనిక సంపత్తి, వ్యూహాత్మక దౌత్యం ఇంకా అనేకాంశాల్లోనూ ఆధిపత్యాన్ని చాటితేనే శక్తివంతమైన దేశాల జాబితాలో చోటు దక్కుతుంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోని శక్తివంతమైన టాప్-10 దేశాల సరసన నిలిచింది. ప్రతియేటా వివిధ సంస్థలు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాకింగ్స్ విడుదల చేస్తుంటాయి. అందులో ఫోర్బ్స్ (Forbes) సంస్థ విడుదల చేసే ర్యాంకింగ్స్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ప్రపంచం 2025లోకి అడుగుపెట్టి నెలరోజులు దాటిన నేపథ్యంలో ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ వేదికపై ఏ దేశం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందో ఈ ర్యాంకింగ్స్ ద్వారా తెలుస్తుంది. ఈ దేశాలు తరచుగా వాటి బలమైన ఆర్థిక వ్యవస్థలు, అధునాతన సాంకేతిక సామర్థ్యాలు, బలీయమైన సైనిక బలం, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ స్థానాల ద్వారా ర్యాంకింగ్స్‌లో టాప్-10 స్థానాలను ఆక్రమించాయి. అంతర్జాతీయ విధానాలను రూపొందించడం నుంచి ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని నడిపించడం వరకు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు ప్రపంచ వ్యవహారాల దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునిక ప్రపంచం గతిశీలతను అర్థం చేసుకోవడానికి వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వాటి నిర్ణయాలు, చర్యలు భూగోళంపై...