కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలను మానోకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వరంగల్‌లో పర్యటిస్తున్నారు. డిసెంబర్ 12 ఉదయం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతాలు పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారని అన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయ ప్రకంపనలు జరగనున్నాయని జోస్యం చెప్పారు. కుటుంబ పాలన, అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కొత్త రైతు చట్టాల్లో ఏ ఒక్క అంశం రైతులకు వ్యతిరేకంగా లేదని తెలిపారు.