King Charles III: కింగ్ ఛార్లెస్‌ గుండెల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ III జన్మదిన వేడుకలను ఆ దేశంతో పాటు కామన్‌వెల్త్ దేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని భారత హైకమిషనర్ కార్యాలయంలోనూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

King Charles III: కింగ్ ఛార్లెస్‌ గుండెల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం
King Charles III

Updated on: Oct 24, 2024 | 1:27 PM

ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్‌లో కింగ్ ఛార్లెస్ III జన్మదిన వేడుకలను బుధవారంనాడు (23, అక్టోబర్ 2024) ఘనంగా నిర్వహించారు. బ్రిటన్, భారత్ సహా కామన్‌వెల్త్ దేశాలకు చెందిన పలువురు దౌత్య, పారిశ్రామిక రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కింగ్ ఛార్లెస్‌కు భారత దేశమంటే ఎంతో ఇష్టమని ఇండియాలో బ్రిటీష్ హై కమిషనర్ లిండీ కామెరూన్ పేర్కొన్నారు. కింగ్ ఛార్లెస్ గుండెల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 2019, అంతకు ముందు భారత్‌లో పర్యటించిన కింగ్ ఛార్లెస్.. భారత్‌ సంస్కృతి పట్ల ఎంతో ఆకర్షితులయ్యారని చెప్పారు. భారత్‌లో కింగ్ ఛార్లెస్ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో 10 సార్లు కింగ్ ఛార్లెస్ భారత్‌లో అధికారిక పర్యటనలు చేపట్టినట్లు గుర్తుచేశారు.

భారత్- బ్రిటన్ మధ్య దశాబ్ధాలుగా బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని ఆకాంక్షించారు.

బ్రిటీష్ హై కమిషనర్ లిండీ కామెరూన్ ఏమన్నారంటే..

తాను ఇక్కడ గత ఆరుమాసాలుగా బ్రిటీష్ హై కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తుచేసుకున్న లిండీ కామెరూన్.. భారతీయులు తన పట్ల చూపిన స్నేహభావం తనను ఎంతో ఆకట్టుకున్నట్లు తెలిపారు. నివాసం ఉండేందుకు భారత్‌ను మించిన దేశం ఉందని భావించడంలేదని కొనియాడారు.

Follow Us