Tamil Nadu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిదంబరం నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం ఓ కొలిక్కివచ్చింది. ఎట్టకేలకు ఆలయ సంపద లెక్కింపు మొదలైంది. గత రెండు నెలలుగా ఆలయ దీక్షితులు, దేవాదాయ శాఖ అధికారుల మధ్య ఇందుకు సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఓ మెట్టు దిగిన దీక్షితుల వర్గం.. ఆలయ సంపద లెక్కింపునకు అంగీకరించింది.
గత కొంతకాలంగా నటరాజస్వామి ఆలయ ధనాగారంలో సంపదను లెక్కించేందుకు దీక్షితుల వర్గం అడ్డుచెబుతూ వచ్చింది. ధనాగారానికి 20 తాళాలతో భద్రపరిచ్చారు. ఈ తాళాలు దీక్షితుల అధీనంలో ఉండడంతో తమిళనాడు దేవాదాయ శాఖ వారిని ఒప్పించింది. దీక్షితుల వర్గం సమక్షంలో లెక్కింపు జరిపేందుకు అంగీకరించారు. దీంతో రెండు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కడలూరు, తిరువణ్ణామలై, జిల్లా దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎట్టకేలకు ఆలయ దీక్షితులు, దేవాదాయ శాఖ అధికారుల మధ్య ఈ వివాదం ఆలయ సంపద లెక్కింపునకు దీక్షితుల వర్గం అంగీకరించడంతో కడలూరు, తిరువణ్ణామలై, జిల్లా అధికారుల సమక్షంలో లెక్కింపు జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి