విశ్వవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ డెవలపింగ్ సిటీస్ లిస్ట్.. రిలీజ్ అయ్యింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్‌లో వెల్లడించిన సమాచారం ఆధారంగా.. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలాకు ర్యాంకులను కేటాయించింది. ఇందులో టాప్ ప్లేస్‌లో మన దేశానికి చెందిన పట్టణమే ఉంది. అంతేకాదు.. టాప్ 10లో మరో రెండు సిటీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫాస్ట్ డెవలపింగ్ సిటీస్ ఏ ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలని అంతా అనుకుంటే పొరబాటే. ఎవరూ ఊహించని విధంగా.. కేరళకు చెందిన మూడు పట్టణాలు ఈ టాప్10 జాబితాలో చోటుదక్కించుకున్నాయి.
మెట్రో సిటీస్‌ను కాదని.. అనూహ్యంగా కేరళకు చెందిన మళప్పురం, కోజికోడ్, కొల్లామ్ టాప్ 10లోపు ర్యాంకులను కొట్టేశాయి. 44.1శాతం వృద్ధితో మళప్పురం టాప్ ర్యాంకు కొట్టేయగా… కోజికోడ్ 4, కొల్లామ్ 10వ ర్యాంకులను సాధించాయి.
ఇక రెండో స్థానంలో వియత్నాంకు చెందిన కేన్, మూడో స్థానంలో చైనాకు చెందిన సుఖిన్, ఐదో స్థానంలో నైజీరియాకు చెందిన అబుజా నిలిచాయి. 2015-2020 మధ్య సాధించిన డెవలప్‌మెంట్స్‌ను బేస్ చేసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. అయితే ఈ వరల్డ్ సూపర్ ఫాస్ట్ సిటీస్ డెవలప్‌మెంట్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మెట్రో సిటీలు లిస్ట్‌లో లేకుండా.. ఇలా చిన్న చిన్న పట్టణాలు వేగంగా డెవలప్ అవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.
Good to see that the fastest growing in India are not the monster metropolises, Mumbai, Delhi, Kolkata etc. When smaller towns & cities grow it signals that a wider distribution of wealth & job opportunities is underway. We need more smaller towns to Rise! https://t.co/ppRnS5udOo
— anand mahindra (@anandmahindra) January 9, 2020