Kerala ‘ఈ బాధలు భరించలేను.. కువైట్ నుంచి కేరళ వచ్చేస్తున్నా..’ ఇంతలో మూగబోయిన ఆమె సెల్‌ఫోన్

ఆరు నెలల క్రితం, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన ఓ కేరళ మహిళ విగతజీవిగా మారింది. యాజమాని పెట్టిన చిత్రహింసలు భరించలేక ప్రాణాలు విడిచింది. ఆమె శరీరంపై కాలిన గాయాలు, కోతలు గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇంటి పనిమనిషిని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తీసుకు వెళ్ళాలంటూ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Kerala ‘ఈ బాధలు భరించలేను.. కువైట్ నుంచి కేరళ వచ్చేస్తున్నా..’ ఇంతలో మూగబోయిన ఆమె సెల్‌ఫోన్
Wayanad Woman Ajitha

Updated on: Jun 01, 2024 | 11:53 AM

ఆరు నెలల క్రితం, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన ఓ కేరళ మహిళ విగతజీవిగా మారింది. యాజమాని పెట్టిన చిత్రహింసలు భరించలేక ప్రాణాలు విడిచింది. ఆమె శరీరంపై కాలిన గాయాలు, కోతలు గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇంటి పనిమనిషిని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తీసుకు వెళ్ళాలంటూ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇంటి యాజమాని పెట్టిన చిత్రహింసలు భరించలేక ప్రాణాలు విడిచిన మహిళకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు కుటుంబసభ్యులు.

వాయనాడ్‌కు చెందిన 50 ఏళ్ల అజిత అనే మహిళ కువైట్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది. గత 6 నెలలుగా ఆమె పనిచేస్తున్న ఇంట్లో వివరించలేని చిత్రహింసలకు గురైంది. ఇంటి యాజమాని మానసికంగా, శారీరకంగా బతికి ఉండగానే నరకం చూపించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు వాయిస్ కాల్స్ చేసి సమాచారం ఇచ్చింది. చివరికి వేధింపులు భరించలేక ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు మహిళను గల్ఫ్‌కు పంపిన ఎర్నాకులంలోని ఏజెన్సీ దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో అజితను ఆమె మొదటి యజమాని కుమార్తెకు చెందిన మరొక ఇంటికి మార్చింది. అప్పటి నుంచి అజిత నుంచి నిత్యం ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. తానూ త్వరలోనే స్వదేశానికి వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపింది.

కువైట్‌లో పరిస్థితులు అంతగా లేకపోవడంతో తాను తిరిగి రావడానికి సిద్ధమవుతున్నానని భర్త విజయన్‌కు చివరిసారిగా మే15 వీడియో కాల్ చేసి సమాచారం ఇచ్చింది అజిత. ఆ తరువాత ఆమె నుండి ఎటువంటి కాల్స్ రాలేదు. అయితే ఎజెన్సీ ద్వారా ఆరా తీయడంతో కువైట్‌లోని ఇంటి యజమాని ఆమె ఫోన్‌ను లాక్కున్నారని విజయన్ చెప్పారు. మే 18న స్వదేశానికి తిరిగి రావడానికి అజిత ఫ్లైట్ టికెట్ బుక్ చేసిందని ఏజెన్సీ అధికారులు విజయన్‌కు చెప్పారు. విమానం బయలుదేరిన తేదీ తర్వాత కూడా అజిత నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఏజెన్సీ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అజిత ఉరి వేసుకుని చనిపోయినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే ఆమె శరీరంపై కాలిన గాయాలు, కోతలతో ప్రాణాలు కోల్పోయిన పనిమనిషిని స్థానిక పోలీసులు గుర్తించారు. దీంతో ఇంటి యజమాని క్రూరంగా ప్రవర్తించడంతో అజిత చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. అజితకు చాలా రోజులు ఆహారం ఇవ్వలేదని, తీవ్రంగా కొట్టడంతో దవడ ఎముకలు విరిగిపోయినట్లు తెలిపారు. తమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందని, ఆమెకు న్యాయం చేయాలంటూ అజిత భర్త విజయన్ కోరతున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసులకు, కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు వేడుకుంటున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..