Women’s Day: దేశంలో మొట్టమొదటి లింగమార్పిడి జంట.. తమకు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా..?

|

Mar 09, 2023 | 5:09 PM

కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించుకున్న తర్వాత దంపతులు చికిత్స ప్రారంభించారు.

Womens Day: దేశంలో మొట్టమొదటి లింగమార్పిడి జంట.. తమకు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా..?
Kerala Trans Couple
Follow us on

మహిళా దినోత్సవం రోజున కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ దంపతులు తమ బిడ్డకు పేరు పెట్టి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకు వారు.. తమకు పుట్టిన బిడ్డ ఆడా..? మగా అన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తమకు పుట్టింది ఆడపిల్ల అని ప్రకటించారు. పాపకు జబియా సహద్ అని పేరు పెట్టారు దంపతులు. ఈ జంట భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ తల్లిదండ్రులు. ఇప్పుడు ట్రాన్స్‌మ్యాన్ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టారు. కేరళలోని కోజికోడ్‌లోని ఉమ్మలత్తూరుకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ దంపతులు కొన్ని నెలల క్రితం పాపకు జన్మనివ్వగా, ఇప్పుడు ఆ పాపకు ఆ దంపతులు పేరు పెట్టారు.

గత ఫిబ్రవరి 2న ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో జహద్‌కు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగింది. ఆ రోజు తమకు పుట్టిన బిడ్డ లింగ గుర్తింపును వెల్లడించడానికి దంపతులు నిరాకరించారు. ఇప్పుడు ఆడపిల్ల అని తెలిజేశారు. ఈ జంట ఇప్పుడు పాపకు జబియా సహద్ అని పేరు పెట్టారు. ఇంతకుముందు, ఈ జంట ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఈ జంట లింగమార్పిడి చేయడంతో న్యాయ ప్రక్రియ సవాలుగా మారింది. ఇదిలావుండగా, సహద్‌ పురుషుడైనప్పటికీ గర్భం దాల్చాలనే ఆశ, ఆలోచన వచ్చింది.

మొదట్లో తాను సంకోచించిందట. ఎందుకంటే ఎంతమంది ప్రజలు ఎలా రియాక్ట్‌ అవుతారో తెలియదు..ఏం అంటారో..నని ఆందోళన చెందానట్టు సహద్‌ తెలిపాడు. అలాగే ఒకసారి విడిచిపెట్టిన స్త్రీత్వానికి తిరిగి రావడం తనకు సవాలుగా మారిందని చెప్పాడు. కానీ జియా ప్రేమ, తల్లి కావాలనే కోరికతో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సహద్ చెప్పాడు. కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించుకున్న తర్వాత దంపతులు చికిత్స ప్రారంభించారు. సహద్ ఆడ నుండి మగగా మారడంలో భాగంగా, శస్త్రచికిత్స ద్వారా రొమ్ములను తొలగించారు. కానీ గర్భాశయం మొదలైనవి మార్చలేదని తెలిసింది. ఇక పుట్టిన బిడ్డకు పాల బ్యాంకు ద్వారా పాలివ్వాలని దంపతులు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..