Kerala Train: కన్నూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఘటనలో ఎట్టకేలకు దొరికిన నిందితుడు..

కేరళలో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది..అయితే ఆ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు..అతడి ఆచూకీ కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మరీ ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు.

Kerala Train: కన్నూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఘటనలో ఎట్టకేలకు దొరికిన నిందితుడు..
Arrest

Updated on: Apr 05, 2023 | 12:56 PM

కేరళలో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది..అయితే ఆ ఘటనలో పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు..అతడి ఆచూకీ కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మరీ ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని షారూఖ్‌ సైబీగా గుర్తించారు.

రెండు రోజుల కిత్రం అలప్పుజ కన్నూర్​ ఎక్స్​ప్రెస్‌లోని డీ1 కంపార్ట్​మెంట్​లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగి కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి, తోటి ప్యాసింజర్​పై పెట్రోల్​ పోశాడు. అనంతరం ప్యాసింజర్​కు నిప్పంటించడంతో ఎనిమిది మంది దాక గాయపడటమే గాక ఆ ఘటనలో మరో ముగ్గురు పట్టాలపై పడి చనిపోయారు.

ఆరోజు ఆ ఘటనకు పాల్పడిన తదనంతరం రైలు దిగుతుండగా నిందితుడు కింద పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయయ్యింది. చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాడు కానీ చికిత్స పూర్తి కాక మునుపే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో తాము రత్నగిరి ప్రాంతంలో తీవ్రంగా సోదాలు నిర్వహించి మరీ షారుఖ్‌ని అదుపులోకి తీసుకున్నారు..నిందితుడి విచారించేందుకు కేరళ పోలీసులు రత్నగిరికి వస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..