కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అనంతరం ఆ ట్రైన్‌లో ఎక్కారు. అందులో ఉన్న విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అయితే అందులో ఓ అమ్మాయి ‘ఇంచక్కడ్ బాలచంద్రన్’ రాసిన ‘ఇని వారున్నోరు తలమురక్కు’ అనే పద్యాన్ని ప్రధాని ముందు పాడింది. ఆ అమ్మాయి పాడుతున్నంతసేపు ప్రశాంతగా విన్న ఆయన.. పాడటం అయిపోయాకా చాలా బాగా పాడావు అంటూ ఆమెను ప్రశంసించారు. అలాగే చాలా మంది విద్యార్థులతో మాట్లాడారు. కొంతమంది విద్యార్థులు ప్రధానికి వారు వేసిన డ్రాయింగ్స్ చూపించారు. ఈ విషయాన్ని ప్రధాని తన అధికారిక ట్వట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మెమొరబుల్ ఇంటరాక్షన్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే ఆ ట్రైన్‌లో ప్రధాని మోదీతో పాటు కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల పాటు కేరళ పర్యటనకు వచ్చిన ప్రధాని వందేభారత్ ఎక్స్‌ప్రెస్, కొచ్చి వాటర్ మెట్రోను ఆవిష్కరించారు. రూ.1500 కోట్లతో డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
A memorable interaction on board the Vande Bharat Express. pic.twitter.com/Ym1KHM5huy
— Narendra Modi (@narendramodi) April 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..