‘మన్ కీ బాత్’ ప్రోగ్రాం కోసం ఐడియాలు ఇవ్వండి’.. ప్రజలకు మోదీ అభ్యర్థన

తన నెలవారీ కార్యక్రమం..'మన్ కీ బాత్' కోసం ప్రజలు తమ ఐడియాలు, సలహాలను, సూచనలను ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈనెల 28 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. దీనికి ఇంకా..

మన్ కీ బాత్ ప్రోగ్రాం కోసం ఐడియాలు ఇవ్వండి.. ప్రజలకు మోదీ అభ్యర్థన

Edited By:

Updated on: Jun 14, 2020 | 5:50 PM

తన నెలవారీ కార్యక్రమం..’మన్ కీ బాత్’ కోసం ప్రజలు తమ ఐడియాలు, సలహాలను, సూచనలను ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈనెల 28 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. దీనికి ఇంకా రెండు వారాల  సమయం ఉన్నప్పటికీ.. ప్రజలు ఇప్పటినుంచే తమ ఆలోచనలను షేర్ చేయాలని, తద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ కాల్స్ కి, కామెంట్లకు తాను స్పందించగలనని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 ని ఎదుర్కోవడం ఎలా అన్న అంశమే ప్రధానంగా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే కదా అన్నారాయన. వ్యక్తులు రికార్డు చేసిన మెసేజ్ ని ఏ నెంబరుకు ఇవ్వాలో దాన్ని కూడా మోదీ షేర్ చేశారు. నమో యాప్ లేదా మై గవర్నమెంట్ అన్న ఫోరాలకు తమ సూచనలు ఇవ్వవచ్చునన్నారు. మీరిచ్ఛే ఐడియాలే ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాయన్నారు.