ప్రారంభమైన మంచు వర్షం.. ప్రముఖ కేదార్‌నాథ్‌ ఆలయం మూసివేత

జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రముఖ ఆలయంలో

ప్రారంభమైన మంచు వర్షం.. ప్రముఖ కేదార్‌నాథ్‌ ఆలయం మూసివేత
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2020 | 11:59 AM

Kedarnath Temple Uttarakhand: జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రముఖ ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. గం.8.30లకు మూసివేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల సీఎంలు యోగీ ఆదిత్యనాథ్‌, తివేంద్రసింగ్‌ రావత్‌, దేవస్థానం బోర్డు సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేదార్‌పురిలో జరుగుతున్న పనులను పరిశీలించి వచ్చారు. కాగా శీతాకాలం నేపథ్యంలో ప్రతి ఏడాది కేదారినాథ్‌ గుడిని తాత్కాలికంగా మూసివేసే విషయం తెలిసిందే.

Read more:

‘ఛత్రపత్రి’ రీమేక్‌లో బెల్లంకొండ.. దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..!

విషాదం.. పెళ్లైన 10 రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్త జంట