నయనతార ఓ ఫైటర్‌…!… ఆకాశానికి ఎత్తిన కత్రినా

నయనతారపై బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎ ఫైటర్‌ అంటూ పొగడ్తలతో ముంచేశారు. కత్రినా తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే’ కు నయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కే’ ప్రచార ప్రకటనలో భాగంగా నయన్‌, కత్రినా ముంబైలో కలుసుకున్నారు. ఆ తర్వాత.. తన మేకప్‌ బ్రాండ్‌ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు “స్పెషల్ థాంక్స్” చెప్పారు. ‘సౌత్‌ లేడీ సూపర్‌‌ స్టార్‌ నయనతారకు బిగ్ థ్యాంక్స్. మీ బీజీ […]

నయనతార ఓ ఫైటర్‌...!... ఆకాశానికి ఎత్తిన కత్రినా

Edited By:

Updated on: May 29, 2020 | 6:01 PM

నయనతారపై బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎ ఫైటర్‌ అంటూ పొగడ్తలతో ముంచేశారు. కత్రినా తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే’ కు నయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కే’ ప్రచార ప్రకటనలో భాగంగా నయన్‌, కత్రినా ముంబైలో కలుసుకున్నారు. ఆ తర్వాత.. తన మేకప్‌ బ్రాండ్‌ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు “స్పెషల్ థాంక్స్” చెప్పారు. ‘సౌత్‌ లేడీ సూపర్‌‌ స్టార్‌ నయనతారకు బిగ్ థ్యాంక్స్. మీ బీజీ షేడ్యూల్‌లో కూడా ముంబై వచ్చి మా మేకప్‌ బ్రాండ్‌ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు థాంక్స్. మీ ఉదారతకు.. మీ అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

అంతేకాకుండా… ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కత్రినా అదే స్థాయిలో పొగిడేశారు. తన అద్భుత నటన, తన సంకల్పం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. తను ఓ ఫైటర్‌. పోరాట యోధురాలిగా కనిపిస్తుంది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందని కత్రినా చెప్పుకొచ్చారు. అంతేగాక తను చేసే పనికి కట్టుబడి ఉంటుంది.