కశ్మీరుపై భద్రతా మండలి సమావేశం…

| Edited By:

Aug 15, 2019 | 9:13 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒంటరైన పాకిస్తాన్‌కు సాయం చేస్తారనుకున్న దేశాలన్ని రిక్త హస్తాలు చూపడంతో ఏంచేయాలో అర్ధంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే తనకు ఎవరైనా మద్దతు పలకకపోతారా.. అనే ప్రయత్నం మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలో జమ్ము- కశ్మీర్ విషయంలో చర్చించేందుకు ఐక్యారాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఒత్తిడితో ఐరాస భద్రతా మండలి క్లోజ్డ్ కన్సల్టేషన్స్ నిర్వహించనున్నట్టుగా సమాచారం. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు జోఅనా రోనెకాను ఉటంకిస్తూ […]

కశ్మీరుపై  భద్రతా మండలి సమావేశం...
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒంటరైన పాకిస్తాన్‌కు సాయం చేస్తారనుకున్న దేశాలన్ని రిక్త హస్తాలు చూపడంతో ఏంచేయాలో అర్ధంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే తనకు ఎవరైనా మద్దతు పలకకపోతారా.. అనే ప్రయత్నం మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలో జమ్ము- కశ్మీర్ విషయంలో చర్చించేందుకు ఐక్యారాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఒత్తిడితో ఐరాస భద్రతా మండలి క్లోజ్డ్ కన్సల్టేషన్స్ నిర్వహించనున్నట్టుగా సమాచారం. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు జోఅనా రోనెకాను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ నెల 16న (శుక్రవారం) జమ్మూ-కశ్మీరుపై క్లోజ్డ్ డోర్స్‌లో చర్చించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.